|
తిరుమల ర్యాలీపై అసెంబ్లీలో దుమారం తిరుమలలో యువజన కాంగ్రెస్ నాయకులు ర్యాలీ తీయడంపై తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ అంశంపై వివరణ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చకు స్పీకరు అనుమతించకపోవడంతో వాద ప్రతివాదాలు చోటుచేసుకున్నాయి. దీనితో స్పీకరు సభను కొంత సేపు వాయిదా వేశారు. తిగుగి సమావేశం కాగానే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమాలను అడ్డుకోవడంతో మరోసారి సభ వాయిదా పడింది. ప్రభుత్వం ఉద్దేశ పూరితంగానే పవిత్ర ప్రదేశాలను కూడా రాజకీయ మయం చేస్తోందని టిడిపి సభ్యులు ఆరోపించారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని, తగిన చర్యలు తీస్కుంటామని మంత్రి రఘువీరా రెడ్డి హామీ ఇచ్చారు. |
| Close |