సభ వాయిదాకు ప్రతిపక్షాలే కారణం: సీఎల్పీ

శాసనసభా కార్యక్రమాలను అడ్డుకోవాలనే ధ్యేయంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలు సభకు వస్తున్నారని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఆరోపించింది. అందువల్లే రెండో రోజు సభలో ఎలాంటి చర్చ చేపట్టకుండానే సభా వాయిదా పడిందని సీఎల్పీ మండిపడింది. సభా నియమాలు ఏమాత్రం పాటించకుండా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రతిపక్ష సభ్యలకే చెల్లిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీల్లో ఐక్యత కొరవడటంతో బీఏసి నియమాలకు విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీలు నడుచుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిపై సావధానంగా చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలకు అంగీకరించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు మేల్కొని నిర్మాణాత్మకంగా వ్యవహరించి, సభాకార్యక్రమాలు సక్రమంగా జరిగేలా సహకరించాలని కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Close