ఎబివిపి కార్యకర్తల వీరంగం

హైదరాబాద్ : ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలోను, ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాలలోను నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు నిరసనగా ఎబివిపి కార్యకర్తలు ఇక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్ సంస్థపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం ఇక్కడి ఇంజనీరింగ్ అడ్మిషన్లకు కౌన్స్లింగ్  జరుగుతుండగా వారు కళాశాలలోనికి చొరబడి కంప్యూటరు ఫర్నిచర్ లను ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Close