|
దిగ్విజయ్ తో మాట్లాడతా : పిజేఆర్ హైదరాబాద్: ఇటీవల బంజారాహిల్స్ లో రేగిన రోడ్డు వివాదం పై తాను ఎఐసిసి కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తో సమావేశం కానున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నేత పి.జనార్ధనరెడ్డి చెప్పారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే తాను ఈ సంఘటన గురించి సింగ్ కు వివరించానన్నారు. ఈ సంఘటనకు సంబంధించి తన కుమారుడిని అరెస్ట్ చేశారని తరువాత విడుదల చేశారని తెలిపారు. సిఎం సోదరుడు వైఎస్ రవీందర్ రెడ్డి ఫిర్యాదు ప్రకారం పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారన్నారు. జూలై 16 న తాను చేపట్టాలనుకున్న ఆమరణ దీక్షను కాంగ్రెస్ అధిష్టనం సలహాతో విరమించుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా పిజేఆర్ భార్య ఇందిరాదేవి రవీందర్ రెడ్డి వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదును వాస్తవాలు లేనందువల్ల తిరస్కరింస్తున్నట్లు పొలీసులు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టనం తనకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. |
| Close |