|
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్: ఆధిక్యంలో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ శనివారం ప్రారంభం కాగా, యూపీఏ అభ్యర్థి ప్రతిభా పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఓట్లు తొలుత లెక్కించగా ఆమెకు 223 సభ్యుల మద్దతు దక్కింది. కాగా ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగిన ఉపరాష్ట్రపతి షెకావత్‌కు కేవలం ఇద్దరు మాత్రమే ఓటేశారు. ఎలక్టోరల్ కాలేజ్‌లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 148గా నిర్ణయించారు. ఈ లెక్కన ప్రతిభకు 33,004 ఓట్లు దక్కగా షెకావత్‌కు 296 ఓట్లు మాత్రమే లభించాయి. ఫలితాలు శనివారం సాయంత్రానికి వెల్లడి కావచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 88.5 శాతం మంది ఎంపీలు, 91 శాతం మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు |
| Close |