|
గ్రేటర్ హైదరాబాద్‌పై తెదేపా, భాజపా వాకౌట్ గ్రేటర్ హైదరాబాద్ అంశంపై శుక్రవారం అసెంబ్లీ అట్టుడికి పోయింది. నిధుల వ్యయం, అభివృద్ధి పనులపై తెలుగుదేశం పార్టీ సభ్యుడు దేవేందర్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా నిధులను ఖర్చు చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతోందని, ఎక్కడ నిధులు అవసరమో అక్కడే ఖర్చు చేస్తున్నామని అన్నారు. దీనికి సంతృప్తి చెందని తెదేపా సభ్యులు సభలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పనులన్నీ అవినీతిమయమ్యాయని ఆరోపిస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు. తెదేపా వాదనలను బలపరుస్తూ.. వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. |
| Close |