|
ఉపరాష్ట్రపతి పదవి కోసం అన్సారీ నామినేషన్ దాఖలు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం యూపీఏ అభ్యర్థి హమీద్ అన్సారీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రుల నేతృత్వంలో ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజ్యసభ ప్రధాన కార్యదర్శి, ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారి యోగేంద్ర నారాయణ్‌కు అన్సారీ తన నామినేషన్ సమర్పించారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఎన్డీయే తరఫున నజ్మా హెఫ్తుల్లా, మూడో ఫ్రంట్ తరఫున రషీద్ మసూద్‌లు కూడా ఈ పదవికి పోటీ చేస్తున్నారు. ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ సోమవారం కాగా, మంగళవారం నామినేషన్ల పరిశీలన ఉండగలదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు పదిన ఎన్నికలు పూర్తయిన వెంటనే కౌంటింగ్ కూడా చేపడుతామని ఆ వర్గాలు వెల్లడించాయి. |
| Close |