వైఎస్ ను జంతువులతో పోల్చిన బాబు !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ నేత చంద్రబాబు ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆహర భద్రతలు ముప్పువచ్చే పరిస్ధితి ఉందని అన్నారు. వరికి మద్దతు ధరపెంచితే, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయన్న ప్రధాని వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గ్రూపులు కడితే ప్రజల్లో అపహాస్యంపాలవుతారని టీడీపీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు, నంద్యాలలోని ఎస్సీ బాలుర హాస్టల్ ను సందర్శించారు. ఢిల్లీలో కేంద్రంతో మాట్లాడలేని వైఎస్, రాష్ట్రంలో తమ పార్టీపై దాడులు మాత్రం చేస్తారని అన్నారు. కనీసం మీడియాలో వచ్చిన వార్తలను కూడా పటించుకోని వైఎస్, ఇక్కడ పులి, ఢిల్లీలో పిల్లిలాగా వ్యవహరిస్తున్నారని అపహాస్యం చేశారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.