క్రిమినల్ కేసు నమోదు చేయాలి-లాలూ
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
గోద్రాలో సుత్రధారులను వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. అందులో ముఖ్యులుగా ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీలను సత్వరమే అదుపులోకి తీసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు.గోద్రా సంఘటనపై ఆపరేషన్ 'కలంక్' పరిశోధన ద్వారా తెహల్కా ఈ నరమేధానికి సూత్రధారులుగా నరేంద్ర మోడీ, అద్వానీల పేర్లను బయటపెట్టడంతో వీరిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాల్సిందిగా లాలు డిమాండ్ చేశారు.