|
నల్లగొండ దగ్గర ఐటి పార్క్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
సామాన్యుల మేలుకు అన్ని రంగాల్లో తాము వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని, అలాగే విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టామని దీనికి అనుగునంగా నల్లగొండ సమీపంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) పార్కును త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు. నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తిలో ఆయన మంగళవారం నల్లగొండ విశ్వవిద్యాలయం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతం విద్యార్థులు నైపుణ్యం సాధించి మంచి ఉద్యోగాలు పొందడానికి తాము విశ్వవిద్యాలయాలను, కాలేజీలను స్థాపిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి, మంత్రులు కె. జానారెడ్డి, డి. శ్రీనివాస్, శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ విశ్వవిద్యాలయాన్ని 300 ఎకరాల్లో నెలకొల్పారు. ఈ విశ్వవిద్యాలయానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయంలో పిజి కోర్సులు ప్రారంభమయ్యాయి.
|
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.