కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు: రాఘవులు

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

    రాష్ట్రంలోని మిగులు భూముల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు విమర్శించారు. బుధవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం అంబారిపేట గ్రామంలో దాదాపు 200ల ఎకరాల మిగులు భూమిని నిరుపేదలతో కలిసి ఆక్రమించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వివిధ శాఖల కింద వివాదస్పద భూముల మెత్తం ఆరులక్షల ఎకరాల వరకు ఉన్నాయని, ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే లక్ష ఎకరాల వరకు మిగులు భూమి ఉందని అన్నారు. గాంధేయవాదులమని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌వారు నిరాహార దీక్షలు చేస్తున్న తమపై బ్రిటిష్‌వారిని తలపిస్తూ కాల్పులు జరుపుతున్నారన్నారు. భూసంస్కరణలు అమలు చేయకపోతే ప్రజలు కాంగ్రెస్‌ను తరిమి కొడతారని రాఘవులు హెచ్చరించారు. కోనేరు రంగారావు కమీషన్ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవాటిని పక్కన పెట్టి ఆమోదించటం వలన పేద వారికి ఎలాంటి ప్రయోజనం కలుగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.