బీఎస్పీలో చేరిక పరిశీలిస్తున్న నరేంద్ర !

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 ' బహుజన సమాజ్‌పార్టీ(బీఎస్‌పీ)లో చేరకను తాను పరిశీలిస్తున్నట్లు తెరాస(ఎన్) ఛీఫ్ అలె నరేంద్ర తెలిపారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 17 న ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయశాంతి, గద్దర్‌లతో పాటు తెలంగాణా సాధనకై కృషి చేస్తున్న 45 సంస్థల ఐక్య కూటమి నేతృత్వంలో బహిరంగసభ జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణా వాదాన్ని అణగదొక్కేందుకు పెద్దలు, రాజకీయపార్టీలు కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. సింగూరు జలాల వరదకాల్వల నిర్మాణ పనులు సవ్యంగా జరగడంలేదని ఆయన పేర్కొన్నారు.

CLOSEE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.