|
' బ్రదర్స్ ' కు షోకాజ్ !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
| ' హైదరాబాద్ : కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ విధానాలకు, రాష్ర్ట ప్రభుత్వ వ్యవహార సరళికి వ్యతిరే్కంగా వ్యాఖ్యాలు చేస్తూ వార్తలకెక్కిన సోదరులు మర్రి శశిదర్ రెడ్డి, పి, జనార్ధన రెడ్డి లకు కాంగ్రెస్ అధిష్టానం శనివారం నోటీసులు జారీచేసింది.ప్రభుత్వంపై అడపాదడపా వీరు చేస్తున్న విమర్శలను తీవ్రంగా పరిగణించిన అధిష్టానం, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ముఖ్యమంత్రిపై విమర్శలు చేసినప్పుడే నోటీసులు జారీచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ ఆదేశించినప్పటికీ, వీరికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా వ్యక్తిగతంగా చర్చిస్తామని పీసీసీ నేత కేకే మిన్నకుండిపోయారు. పట్టువీడని దిగ్విజయ్, వారి నోళ్ళకు సంకెళ్ళు వేయాల్సిందేనని కేకేకు మరోసారి స్పష్టం చేసినట్టు సమాచారం. జంటబాంబు పేలుళ్ల బధితులను సోనియా గాంధీ పరామర్శించాలని వారు పట్టుబట్టారు. వారు వాధితులను పరామర్శించకుండా గుంటూరు సభ నుంచే తిరిగి వెళ్లి పోవడం రాజకీయంగా పార్టీకి నష్టం కలిగిస్తుందని వారు మీడియా సమావేశం లో తీవ్రంగా విమర్శించారు.ఆమె వై ఎస్ సలహా కారణంగానే వాధితులను కలవకుండా వెళ్లిపోయారని, దానికి ప్రజలు వై ఎస్ కు తగిన విధంగా గుణపాఠం చెబుతారని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే . | |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.