|
ఇకనైన మేల్కోండి :బాబు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' రాష్ట్రం లో లోపించిన శాంతిభద్రతలను తిరిగి నెలకొల్పడానికి ప్రభుత్వం ఇక నైనా మేల్కోనాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు.మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిపై దాడి యత్నంకి స్పందించిన ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.నేదురమల్లి దంపుతులపై జరిగిన మందుపాతర దాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం నెల్లూరు సమీపంలో జరిగిన ఈ దాడిలో నేదురుమల్లి, ఆయన సతీమణి, రాష్ట్ర మంత్రి రాజ్యలక్ష్మిలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.విశాఖ లోక్‌సభ సభ్యుడైన నేదురుమల్లి తమ కారులో తిరుపతి వెళుతుండగా, చిత్వేడు సమీపాన ఉన్న ఓ కల్వర్టు వద్ద ఈ మందుపాతర పేల్చారు. ఇది మావోయిస్టుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ మందుపాతర దాడిలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు మరణించగా, మరో ఐదుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. నేదురమల్లిపై దాడిని తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నామని వైఎస్ తెలిపారు. దాడిని మావోయిస్టుల పనిగానే భావిస్తున్నామని చెప్పారు.బుల్లెట్ ప్రూఫ్ సదుపాయం కలిగిన ఆయన వాహనం ఈ పేలుడు నుంచి తృటిలో తప్పించుకున్నప్పటికీ, ఆ వెనకే వచ్చిన కాన్వాయ్ ధ్వంసమై ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు మరణించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకై వారు తిరుపతి వెళుతుండగా ఈ దాడి జరిగింది. మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకే ఈ దాడియత్నానికి పాల్పడ్డారని హోం మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.