రాష్ర్టం లో మిగులు భూములను పేదలకు పంచాలి

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' రాష్ట్రం లోఉన్న మిగులు భూములను పేదలకు అందించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పెదపట్నంలో జరిగిన భూ పోరాట సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని 70 లక్షల ఎకరాల భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం పేదలు చేపట్టిన ఉద్యమాన్ని అణచి వేసేందుకు న్యాయవ్యవస్థ కూడా సహకరించడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోని 70 లక్షల ఎకరాల భూములను నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2 న మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శన చేయనున్నట్టు నారాయణ వివరించారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.