|
|  |
పార్లమెంట్ కు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని తాను భావించడంలేదని, కాంగ్రెస్ తప్ప ఏ ఇతర పార్టీ అందుకు సిద్ధంగా లేవని, వారికి ఎన్నికలంటే భయమని రాష్ట్ర మంత్రి డి.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కొన్ని పార్టీలు పనిగట్టుకుని మధ్యంతర ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదన్నారు. ఒక వేళ మధ్యంతర ఎన్నికలు వస్తే రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పధకాలే పార్టీని గెలిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఐదున్నర వేల కోట్ల రూపాయలు రుణాలు పావలా వడ్డీ కింద ఇస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందన్నారు.
|
|