ఎన్నికలకు మేము సిద్దమే:బిజెపి
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

కర్నాటక రాజకీయ సంక్షోభం రోజురోజుకు వింత మలుపులు తిరిగుతోంది. రెండేళ్ల క్రితం కుదిరిన అధికార బదిలీ ఒప్పందం ప్రకారం ఈ నెల మూడో తేదీన మిత్రపక్షానికి అధికారం అప్పగించాల్సిన జేడీఎస్ అందుకు నిరాకరించడంతోపాటు గురువారం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది. అయితే కర్నాటక ముఖ్యమంత్రి కుమరస్వామీ చేసిన ఈ హెచ్చరికపై బీజేపీ స్పందిస్తూ తాము కూడా ఎన్నికలకు సిద్ధమేనని ధీటైన జవాబిచ్చింది. ఒప్పందం ఉల్లంఘనకు గురైతే కర్నాటకలో మధ్యంతర ఎన్నికలు తప్పవనే ఉహాగానాల నేపథ్యంలో బీజేపీ సీనియన్ నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తామూ ఎన్నికలు వస్తే తాము కూడా అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రెండేళ్ల క్రితం జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పు చేసినట్లుగా భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు తాము దానిని తప్పుగా పరిగణించడం లేదన్నారు. ఒప్పందం ఉల్లంఘనకు గురవుతుందని తాను భావించడం లేదని వెంకయ్య చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, జేడీఎస్ చీఫ్ దేవెగౌడల మధ్య జరిగే సమావేశంలో సమస్యకు పరిష్కారం లభించవచ్చన్నారు.

CLOSEE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.