|
కర్నాటక అధికార బదిలీ ఒప్పందంపై శనివారం తమ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీకి తెలియజేస్తామని జేడీఎస్ వెల్లడించింది. అధికార బదిలీ ఒప్పందంపై నెలకొన్న వివాదంపై జేడీఎస్ ప్రధాన కార్యదర్శి కె. దినేష్ అలీ శుక్రవారం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బీజేపీతో తమ సంబంధాలపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించనుంది. కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను తాము శనివారం బీజేపీకి తెలియజేస్తామని అలీ చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో తమ పార్టీ అధ్యక్షుడు దేవెగౌడ శనివారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కర్నాటకలో అధికర బదిలీపై జేడీఎస్ తీసుకున్న తాజా నిర్ణయాలను దేవెగౌడ బీజేపీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
|