|
|  |
రాష్ట్రంలో ఈ సారి ఎన్నికల్లో తాము ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునేది లేదని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలు వస్తే తాము ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కరీంనగర్ లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణాలో తిరగడానికి ఏ పార్టీకి అధికారం లేదని తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఆకర్షించడానికి పలు పార్టీలు ఎత్తుగడలను వేస్తున్నాయని ఆరోపించారు. త్వరలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పవని, అందులో తమ పార్టీనే విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణాలో పలు మంచి ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
|
|