50 వేల కోట్ల రూపాయలు ఆర్జించిన మాజీ సిఎం-జిఎస్ రావ్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
'ముఖ్యమంత్రి గంటకు కోటి చొప్పున ఇప్పటికి 29 వేల కోట్లు సంపాదించారని' మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణకు బదులుగా 'చంద్రబాబు నాయుడు తమ హయాంలో మొత్తం 50 వేల కోట్ల రూపాయలు సంపాదించారని' పి.సి.సి. తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు బుధవారం తిరిగి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్ల రూపాయలనూ విదేశాలలో పెట్టుబడులుగా పెట్టారని ఆయన అన్నారు. ఆ ఆస్తులన్నిటినీ ఎక్కడెక్కడ ఏ రూపాలలో తరలివెళ్లిందీ చెప్పగలమని ఆయన అన్నారు.