|
|  |
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సంపాదన గంటకు కోటి రూపాయలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 29 వేల 784 కోట్ల రూపాయలు సంపాదించారని ఆయన అన్నారు. అక్రమ భూఆక్రమణలకు వ్యతిరేకంగా చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గురుకుల్ ట్రస్టు భూముల్లో వైయస్ సోదరుడు వివేకానంద రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆయన విమర్శించారు. అక్రమంగా అక్రమించుకున్న భూములను పేదలకు పంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములను ప్రభుత్వం తక్కువ ధరలకు ఇతరులకు కట్టబెడుతోందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ మంత్రులు, నాయకులు డబ్బులు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (హుడా) వ్యాపార సంస్థగా మారిందని ఆయన విమర్శించారు.
|
|