|
|  |
ముందుగా ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం జెడిఎస్ కర్ణాటకలో రాజ్యాధికారాన్ని బిజేపీకి అప్పగించి మాట నిలబెట్టుకోవాలని బిజెపి సీనియర్ నాయకుడు ఎం వెంకయ్యనాయుడు అన్నారు.అన్నారు. షామీర్ పేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో గురువారం వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరమిమ్మని తాము జెడిఎస్ ను వేడుకోవడం లేదని, హామీని నిలబెట్టుకోమని మాత్రమే అడుగుతున్నామని అన్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలన్న జెడిఎస్ డిమాండ్ పై వెంకయ్య స్పందిస్తూ,ఎవరు నాయకత్వం వహించాలనేది తమ పార్టీ సంబంధించిన అంశమని ఈ విషయంపై ఇతర పార్టీల జోక్యం అనవసరమన్నారు. యాడియూర్ప ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 5న జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుందని, దాని తర్వాతే అధికార మార్పిడిపై ప్రకటన చేస్తామని జెడిఎస్ తెలిపిందని ఆయన చెప్పారు. అధికార బదలాయింపుపై అప్పటివరకు వేచి చూస్తామన్నారు. జెడిఎస్ సంకీర్ణ ధర్మాన్ని నిలబెట్టుకుంటుందన్న నమ్మకాన్ని వెంకయ్య వ్యక్తం చేశారు.
|
|