|
హారిస్బర్గ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని ఐన హారిస్బర్గ్ నగరంలో 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఏషియన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ పెన్సిల్వేనియా ఆధ్వర్యంలో అన్ని భాషా సంఘములు కలసి అత్యంత ఆనందోత్సాహాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నాయి. ఈ కార్యక్రమానికి సుమారుగా 1600 మంది భారతీయులు హాజరయ్యారు. ఆగస్ట్ 19న జరిగిన ఈ వేడుకలలో తెలుగు వారు ప్రదర్శించిన పరమత సహనము మరియు హారిస్బర్గ్ ఇడొల్ అనే హస్యనాటికలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భముగా స్టేట్ అటార్నీ జనరల్ టాం కోర్బెట్ భారతీయులను అబినందిస్తూ సందేశాన్ని అందించారు. తెలుగు, తమిళ,గుజరాతీ, మరాఠీ,మలయాళ, పంజాబీ సంఘములు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో సాంస్క్రుతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.