|
|
 |
ఇతర దేశాల కొత్త ఆయుధల ఎగుమతులపై నియంత్రణ విధించడాన్ని తాము అనుమతించబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆదేశాలు రష్యా ఆయుధాల సరఫరా ఆయా దేశాల భద్రతా సామర్థ్యం పెంపు, స్థిరత్వాన్ని ఉద్ధేశించిందేనని చెప్పారు. మాస్కోలో గురువారం రష్యా భద్రతా దళాల సాంకేతిక సహకార కమిషన్‌తో సమావేశానంతరం పుతిన్ మాట్లాడుతూ రాజకీయ, ఏకపక్ష విధానాల ద్వారా విధించే అంక్షలను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఆయుధాల ఎగుమతికి తాము ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు తెలిపారు. ఆయితే వీటి విషయంలో అంతర్జాతీయపరంగా అన్ని జాగ్రత్తలను పాటిస్తూ, నెరవేరుస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ఇతర దేశాలకు ఆయుధ ఎగుమతులను ఆపివేయాల్సిందిగా రష్యాకు అమెరికా మరో సారి ఉద్ఘాటించింది. ఇరాన్‌కు ఆయుధాల ఎగుమతిని నిలిపివేయాలని అమెరికా రాజకీయ సంబంధాల కార్యదర్శి నికోలస్ బర్న్స్ గతంలో రష్యా ప్రభుత్వాన్ని కోరారు.
|
|