బెనజీర్‌ను హతమార్చుతాం:మౌలానీ ఫకీర్ మహ్మద్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను హతమార్చి తీరుతామని ఆ దేశ మోస్ట్ వాంటెడ్ తాలిబన్ నేత మౌలానీ ఫకీర్ మహ్మద్ హెచ్చరించాడు. ఆమె స్వదేశానికి వస్తే ఏమి జరుగుతుందో.. ఎనిమిదేళ్ళ తర్వాత సొంతగడ్డుకు వచ్చిన తొలి రోజునే రుచి రూపించామని ఆయన పేర్కొన్నారు. దీని నుంచి గుణపాఠం నేర్చుకోని పక్షంలో బెనజీర్‌కు త్వరలోనే మా తడాఖా చూపిస్తామని స్పష్టం చేశారు. తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువగా గల బాజపూర్‌ ఎజెన్సీ ప్రాంతంలో వందలాది అనుచరగణంతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మాహుతి దళ సభ్యుల చేతిలో భుట్టోకు చావు తప్పదని జోస్యం చెప్పారు. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులను చూసేందుకు బెనజీర్ దుబాయ్ వెళ్లిన విషయం తెల్సిందే. వారం రోజుల తర్వాత ఆమె తిరిగి స్వదేశానికి చోరుకోనున్నారు. ఆ మరుసటి రోజున రావల్పిండిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగింస్తారు. ఈ నేపథ్యంలో తాలిబన్ నేత ఇలా హెచ్చరికలు జారీ చేయడంతో ఆమెకు భద్రతను మరింత పెంచనున్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.