|
|
 |
చంద్రుడిపైకి చైనా తొలి ఉపగ్రహాన్ని బుధవారం అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడి పైకి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు చైనా అధ్యక్షుడు జింటావో అభినందనలు తెలియజేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన చాంజే 1 అనే ఈ ఉపగ్రహం సిచువాన్ రాష్ట్రంలోని గ్జీచాంగ్ కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం చంద్రుడిపైకి ప్రయోగించబడింది. ఈ ఉపగ్రహం ఈ నెల 31వ తేదీన చంద్రుడికి మధ్య ఉన్న సరిహద్దు కక్ష్యలోకి చేరుకుంటుందని స్పేస్ సైన్స్, అప్లైడ్ రీసెర్చ్ సెంటర్ డైరక్టర్ వూజీ తెలిపారు. వచ్చేనెలలో ఇది చంద్రుడి తొలి చిత్రాన్ని భూమికి తీసి పంపిస్తుందని ఆయన వివరించారు.
|
|