|
|
 |
పాకిస్తాన్ లో ఆయుధాలను తీసుకెళుతున్న ఓ సైనిక వాహనం ప్రమాదవశాత్తూ పేలి మరణించిన సైనికుల సంఖ్య 25 కు చేరింది. మరో అయిదుగురి స్థితి ఆందోళనకరంగా ఉంది. పాక్ వాయువ్య సరిహద్దు ప్రాంతమైన స్వాట్ ప్రాంతానికి 32 మంది సైనికులను, ఆయుధ సామాగ్రిని గురువారం ఓ ట్రక్కులో తీసుకెళుతున్నారు. ఆ సమయంలో ట్రక్కులోని పేలుడు పదార్ధాలు ఒక్కసారిగా పేలడంతో అందులోని సైనికుల్లో 16 మంది సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు ఆ దేశ సైనిక వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనను ఘటనపై మీడియా మరోవిధంగా పేర్కొంటోంది. సైనికులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయని న్యూస్ ఛానల్ 'డాన్' తెలిపింది.
|
|