|
|
 |
జార్ఖండ్ రాష్ట్రంలో నక్సలైట్ల దాడి ఫలితంగా ఆ రాష్ట్రంతో బీహార్‌కు ఉన్న రహదారి సరిహద్దులను మూసివేశారు. అంతేకాకుండా.. తక్షణం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాల్సిందిగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిధ్ జిల్లా చల్కారి గ్రామంలో నక్సలైట్లు దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఇందులో మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కుమారుడుతో పాటు... 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీహార్-జార్ఖండ్ రాష్ట్రాల సరిహద్దులను మూసివేశారు. అనంతరం ఢిల్లీ వెళ్లే ముందు సీఎం నితీష్ కుమార్ జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడాతో సంఘటనపై చర్చించారు. నక్సలైట్ల కార్యకలాపాల ఏరివేతకు పూర్తి సహకారాన్ని అందిచనున్నట్టు నితీష్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే.. కుమారుడుని కోల్పోయిన బాబూలాల్ మరాండీతో కూడా నితీష్ మాట్లాడి, ఓదార్చారు.
|
|