|
డార్ఫర్ చర్చల ప్రారంభం నేపధ్యంలో సూడాన్ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటన చేసింది. అయితే ఈ చర్చలకు ముఖ్య తీవ్రవాద సంస్థల నేతలు హాజరు కాకపోవడంతో ఆ చర్చలు ఫలప్రదం కావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. లిబియాలోని సిర్తె పట్టణంలో జరిగే ఈ చర్చలను పురస్కరించుకుని వెంటనే ఈ కాల్పుల నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని సూడాన్ అధ్యక్షుడి సలహాదారు నఫీ అలీ నఫీ తెలిపారు. అయితే పశ్చిమ సూడాన్‌లోని డార్ఫర్ ప్రాంతంలో గత నాలుగున్నరేళ్లుగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేని సూడాన్ ప్రభుత్వం ఈ కొత్త హామీని ఎలా నెలవేర్చగలదదోనని ఈ చర్చల్లో పాల్గొంటున్న ఓ తీవ్రవాద సంస్థ నేత అనుమానం వ్యక్తం చేశారు.
|