|
|
 |
జార్ఖండ్ రాష్ట్రంలో నక్సల్స్ మరో మారు పంజా విసిరారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక గిరిధ్ జిల్లాలోని చిల్కరి గ్రామంపై సాయుధ నక్సలైట్లు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో 17 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కుమారుడు అనూప్ మరాండీ కూడా ఉన్నారు. బాబూలాల్ మరాండీ సోదరుడుని లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు ఈ దాడి నిర్వహించారు. అయితే.. ఆయన మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడగా, మరాండీ కుమారుడు మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం రాత్రి చిల్కరి గ్రామంలో ఓ సాంస్కృతి కార్యక్రమం జరుగుతుండగా నక్సలైట్లు ఒక్కసారిగా దాడి చేశారు. తొలుత బాంబులతో దాడి చేయడం వల్ల సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకిస్తున్న గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం గ్రామస్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇదిలావుండగా.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మధు కోడా లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అంతేకాకుండా.. ప్రమాద స్థలాన్ని సీఎం మధుకోడాతో పాటు.. రాష్ట్ డీజీపిలు సందర్శించి, పరిస్థిని అంచనా వేశారు.
|
|