|
|
 |
తన మాతృదేశ భవిషత్తు కోసం,తనకు ఎదురయ్యే ఏ సమస్యలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ప్రకటించారు. పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి,దేశ భవితకు ప్రతిబంధకంగా మారిన తీవ్రవాద చర్యలు ఎదుర్కోవడానికి తాను ఎలాంటి సమస్యలపైనైనా పోరాడేందుకు సిద్ధమని ఆమె చెప్పారు. ఇటీవల భుట్టో పాక్ రాక సందర్భంగా ఆమెపై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆమె విలేకరులతో మాట్లాడుతూ తనపై బాంబు దాడి సందర్భంలో 150 మంది అమాయక ప్రజలు మరణించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ బాంబు దాడికి పాల్పడిన వారిని, ఇందుకు సహకరించిన వారిని గుర్తించడంలో ప్రభుత్వం శ్రద్ధ వహించాలని కోరారు.
|
|