|
|
 |
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ తాజాగా మరో వీడియో టేపును విడుదల చేశాడు. ఇందులో ఇరాక్ లోని తీవ్రవాదులంతా ఏకం కావాలని ఆయన పిలువునిచ్చాడు. ఇరాక్ లో అల్ ఖైదాను వ్యతిరేకిస్తున్న సున్నీలంతా తమలో నెలకొన్న విభేదాలను తొలగించి కలసిపోవాలని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో ఇరాక్ లో కొందరు సున్నీ అరబ్ గిరిజనులు అమెరికా దళాలతో చేతులు కలిపి అల్ ఖైదాపై పోరు సాగించడాన్ని ఈ వీడియో టేపులో ప్రస్తావించాడు. ఇరాక్ లోని తీవ్రవాదులతో పాటు తీవ్రవాదులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చాడు. ఇందుకోసం ముస్లిం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని పేర్కొన్నాడు. అల్ ఖైదాలో విభేదాల పరిష్కారంలోనూ, గ్రూపులు కట్టకుండా నిరోధించడంలోనూ నన్ను నేను ఎప్పుడూ అప్రమత్తం చేసుకుంటూనే ఉంటాను. ఏ విషయంలోనూ అతిగా వ్యవహరించను. సర్వాధికారాలు తమవే అన్నట్టు నాయకులు ప్రవర్తించకూడదని, మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లోనే నడుచుకోవాలని లాడెన్ తాజాగా పిలువునిచ్చాడు.
|
|