|
|
 |
కరాచీ : పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో లక్ష్యంగా కరాచీలో జరిగిన పేలుళ్లలో మొత్తం 164 మంది చనిపోయారు. 500 మంది పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కంపిస్తున్నాయి. ఈ బాంబు దాడిలో బెనజీర్ తృటిలో తప్పించుకున్నారు. ఎనిమెదేళ్ల విరామానంతరం స్వదేశానికి చేరుకున్న భుట్టోకు ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. అనంతరం పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా సమాధి వద్దకు భుట్టో ర్యాలీగా బయల్దేరారు. అక్కడ జరగాల్సిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించాల్సి ఉంది. ఈలోపే బాంబు పేలుడు జరగం తో ర్యాలీనీ రద్దు చేశారు. ర్యాలీ కొనసాగుతుండగా అర్ధ రాత్రి 1.30 గంటల ప్రామతంలో కాన్వాయ్ కు సమీపంలో మొదటి పేలుడు జరిగింది. ప్రజలు భయంతో పరుగులుతిస్ శఆరు. నిమిషాల తేడాలోనే భుట్టో ప్రయాణిస్తున్న వాహనానికి సమీపంలో మరో బాంబు దాడి జరిగింది. పేలుడు ధాటికి భుట్టో ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం అద్దాలు దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను సురక్షితంగా ఆమె స్వగృహం బిల్వాల్ హౌస్‌కు చేరుకున్నట్లు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధి చెప్పారు. కాన్వాయ్ కు కొన్ని అడుగుల దూరం లోనే పేలుళ్లు జరగం తో మృతుల్లో ఎక్కువ మంది పోలీసులు, పీపీపీ కార్యకర్తలే ఉన్నారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతమంతా బాధితుల మహాకారాలతో నిండిపోయింది. ఈదుర్ఘటన అనంతరం పోలీసులు కరాచీలో హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ విధించారు. కరాచూలోనీ స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. కరాచీ పేలుళ్ళు ఆత్మాహుతి దాడులేనని పాకిస్థాన్ తెలిపింది.
|
|