|
|  |
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రంజాన్ పండుగ తరువాత మళ్లీ స్వదేశానికి వచ్చే అవకాశాలున్నాయని ఆయన సోదరుడు, పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ అధ్యక్షుడు షబాజ్ షరీఫ్ ఓ టీవీ ఛానల్‌కు తెలియజేశారు. సెప్టెంబర్ 10 న ఇస్లామాబాద్ విమానాశ్రయానికి వచ్చిన షరీఫ్‌ను పాక్ ప్రభుత్వం బలవంతంగా జెడ్డాకు పంపివేసింది. షరీఫ్ రాక సందర్భంగా ఆ రోజు ఇస్లామాబాద్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన్ను విమానాశ్రయం నుంచి బయటకు రాకుండానే జెడ్డాకు పంపివేసి పాక్ ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. అయితే షరీఫ్ రంజాన్ తరువాత మళ్లీ అక్టోబర్ 18 ప్రాంతంలో తిరిగి పాక్ వస్తారని అతని సోదరుడు చెప్పారు.
|
|