భారత్ తీరానికి చేరుకున్న బంగ్లా జాలర్లు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

చేపల వేటకోసం సముద్రంలోకి వచ్చిన సుమారు 700 మంది బంగ్లాదేశ్ జాలర్లు తుఫాను ధాటికి చెల్లాచెదురై భారత్ లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర తీరం వెంబడి పలు ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వీరంతా ఉద్దేశ్యపూర్వకంగా కాక ప్రకృతి వైపరీత్యం కారణంగా మనదేశంలోకి అడుగుపెట్టడంతో వారిని మానవతాదృక్పథంతో స్వదేశానికి పంపే దిశగా భారత వర్గాలు సహకరిస్తున్నాయి. బంగ్లాదేశ్ లోని నాంఖానా, శంకర్ పూర్, మిడ్నాపూర్ వంటి తదితర జిల్లాలనుంచి పడవలతో వీరందరూ చేపల వేటకు వెళ్లారని పోలీసుల విచారణలో తేలింది. ఇదే విధంగా కేతువా ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన 20 పడవలతో కూడిన 280 మంది జాలర్లు భారీ కెరటాల ధాటికి చెల్లా చెదురైయ్యాయని జాలర్ల వద్ద పోలీసులు జరిపిన విచారణలో తేలింది. నామఖానా ప్రాంతంలోని 30 మంది జాలర్లు, 100 పడవలతో కూడిన 1,200 మంది జాలర్లు ఈ అలల ధాటికి చెల్లాచెదురై పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నట్లు భద్రతా దళ అధికారిక వర్గాల వివరాలు తెలియజేశాయి

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.