|
|  |
శ్రీలంక లోని వేర్వేరు ప్రాంతాల్లో ఆ దేశ భద్రతా దళాలకు, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య జరిగిన యుధం లో 27 మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు మృతి చెందారు. ఈ పోరులో మరో 30 మంది గాయపడ్డారని శ్రీలంక రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అదే ప్రాంతంలో రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు అమాయక పౌరులు కూడా మృతి చెందారు.ఈ బాంబు దాడికి ఎల్టీటీఈ తీవ్రవాదులే కారణమని రక్షణ శాఖ అనుమానిస్తోంది. కిలాలీ రక్షణ రేఖ వద్ద దాడి చేసేందుకు ఎల్టీటీఈ తీవ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలోని మరో రెండు ప్రదేశాల్లో భద్రతా దళాలు ఎల్టీటీఈ తీవ్రవాదులకు చెందిన రెండు బంకర్లను ధ్వంసం చేశారు.
|
|