|
|  |
ప్రవాస జీవితం గడుపుతున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షురాలు బెనజీర్ బుట్టో స్వదేశానికి వచ్చే నెల 18 న రానున్నారు. ఇస్లామాబాద్ లో సమావేశమయిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ముషారఫ్ తో అధికారాన్ని పంచుకునే ప్రసక్తే లేదని బుట్టో తేల్చిచెప్పారు. జోడు పదవుల్లో కొనసాగే అర్హత ముషరఫ్ కు లేదని బుట్టో విమర్శించారు. పాక్ ప్రభుత్వం అంగీకరించకపోయినా ఆమె కరాచీలో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి ప్రతిష్టింపజేసేందుకే బెనేజీర్ వస్తున్నట్లు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) వెల్లడించింది. బుట్టో గత ఏడేళ్లుగా బ్రిటన్, అమెరికా, యూఏ ల్లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. మరోవైపు బుట్టో స్వదేశానికి వచ్చిన నవాజ్ లా తిరిగి ప్రవాసానికి పంపబోమని, అయితే ఆమెపై ఉన్న అవినీతి అరోపణలను ఎదుర్ఖొవలసి ఉంటుందని పాక్ ప్రభుత్వం తెలిపింది.
|
|