|
శిశుమరణాల రేటు తగ్గింది-యునిసెఫ్ వెల్లడి
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' ప్రపంచం మోత్తమ్మీద శిశుమరణాల రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్ధాయికి చేరుకుందని ఐక్యరాజ సమితి బాల్య నిధి సంక్షేమ సంస్ధ యునెసెఫ్ ప్రకటించింది. విస్తృత ప్రచారంతోనే చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడిందని ఆ సంస్ధ అధికారులు వెల్లడించారు. 2015 కల్లా ఐదు సంవత్సరాలలోపు శిశువుల మరణశాతాన్ని రెండొంతులు తగ్గించాలని, 2000 సంవత్సరంలో జరిగిన ఐరాస మిలీనియం సదస్సు లక్ష్యంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. దీన్ని నెరవేర్చేందుకు యునిసెఫ్ ఆధ్వర్యంలో తట్టూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులు, తల్లిపాలతో సమకూరే ఆరోగ్యప్రయోజనాలపై చేపట్టిన విసృత ప్రచారం ఇచ్చిన సత్ఫలితాల వల్లే దీన్ని సాధించినట్టు ఆ సంస్ధ ప్రకటించింది. 1960 వరకూ సంవత్సరానికి రెండుకోట్ల మంది చిన్నారులు ఏదో ఒక వ్యాధితో చనిపోతుండేవారు. తొలిసారిగా ఇప్పుడు వారి సంఖ్య సగానికి సగం పైగా తగ్గిపోయింది. ఆఫ్రికా ఖండంలోని దేశాలలో శిశుమరణాల రేటు నాలుగేళ్ళలో ఇరవై తొమ్మిది శాతానికి తగ్గింది. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో మాత్రం పరిస్ధితి మీ మార్పు లేదని యూనిసెఫ్ అధికారులు వెల్లడించారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.