|
ఇరాన్ పై పోరు కు ఫ్రాన్స్ పిలుపు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' ఇరాన్ పై పోరుకు సిద్ధం కావాలని ఫ్రాన్స్ అగ్రరాజ్యాలకు పిలుపునిచ్చింది. అణు బాంబులు తయారు చేసుకోనివ్వకుండా అడ్డుకునే విషయంలో తీవ్రంగా ఉన్నామన్న విషయాన్ని ఆ దేశానికి చాటిచెప్పాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి బెర్నార్డ్ కౌచ్ నెర్ తెలిపారు.యురేనియం శుద్ధీకరణ పేరుతో వారు ఇరాన్ అణు బాంబులు తయారు చేయడాన్ని అంగీకరించలేమని స్పష్టం చేశారు. ఇంతవరకు ఆ దేశ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఇరాన్ అణు వివాదం విషయంలో దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని ఇదివరలో ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజి సూచించిన తరుణంలో ప్రస్తుతం ఆ దేశ వైఖరి మారిందనడానికి ఇదో నిదర్శనంగా నిలుస్తోంది. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.