|
|  |
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాను బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు ఆదివారం ఆదేశించింది. దాదాపుగా ముడు వారాల క్రితం బంగ్లాదేశ్ పోలీసులు ఖలీదా జియాను, ఆమె చిన్న కుమారున్నీ ముడుపుల ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అయితే వీరిద్దరిని బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లాయర్లు మూడు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆదివారం విచారణ జరిపిన హైకోర్టు జియాకు మాత్రమే బెయిల్ మంజూరు చేసింది. ఆమె కుమారుడికి మాత్రం బెయిల్ జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఢాకాలో సెప్టెంబర్ మూడో తేదీన జియా, ఆమె కుమారుడు అరాఫత్ రెహ్మాన్ కోకో అరెస్టయ్యారు
|
|