ఇరాక్ లో ఆకశ్మిక పర్యటన జరిపిన బుష్

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 ' అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాక్ లో సోమవారం ఆకస్మిక పర్యటన జరిపారు. సిడ్నిలో జరగనున్న ఎపెక్స్ సమావేశాలకు వెళుతూ బాగ్ధాద్ సమీపంలోని అల్ అసాద్ ఎయిర్ బెస్ లో దిగారు. ఇరాక్ లోని అత్యంత ప్రమాదకర పట్టణాల్లో ఒకటైన బస్రా నుంచి బ్రిటన్ తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే ఈ పర్యటన జరగడం విశేషం. బ్రిటన్ సైన్యాన్ని ఇరాక్ ప్రధాని నౌరి మలికి, గిరిజన నేతలు, సైనిక అధికారులతో బుష్ కలిసి చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో బుష్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్, రక్షణ శాఖ మంత్రి రాబర్ట్ గేట్స్ అమెరికా భద్రత సలహదారు స్టీఫెన్ హార్డ్ లీ ఉన్నారు. ఇరాక్ లో సుస్థిరత నెలకొల్పేందుకు అమెరికా సైన్యం సాయం చేస్తుందని చెప్పడమే బుష్ పర్యటన ముఖ్యోద్దేశంగా తెలుస్తోంది. 2005, 2006 లో కూడా బుష్ ఇలాగే ఆకస్మిక పర్యటన జరిపారు.

CLOSEE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.