|
|  |
ఉత్తరకొరియాకు పెద్ద ఎత్తున ఇంధన సాయం చేయడంపై తాజాగా బీజింగ్‌లో ప్రారంభమైన ఆరు దేశాల సమావేశాల్లో చర్చలు జరపనున్నట్లు అమెరికా రాయబారి క్రిస్టోఫర్ హిల్ చెప్పారు. ఉత్తర కొరియా చేపట్టిన వివాదాస్పద అణు కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు ఆ దేశం అంగీకరిస్తే పెద్ద ఎత్తున ఇంధన సాయం చేస్తామని ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందంలో ఆరు దేశాలు అంగీకరించాయి. ఉత్తరకొరియా చమురు సరఫరా చేయడంపై ఆరు దేశాలు శనివారం ఉదయం చర్చలు జరుపుతామని హిల్ తెలిపారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తే ఆ దేశానికి ఇంధన సాయం చేసేందుకు అమెరికా, దక్షిణకొరియా, రష్యాలు అంగీకరించాయి. ఫిబ్రవరి 14న కుదిరిన చారిత్మాత్రక ఒప్పందం ప్రకారం అణు కార్యక్రమాల వివరాలను వెల్లడించడంతోపాటు, గ్రాఫైట్ ఆధారిత రియాక్టర్లతో సహా అక్కడి అన్ని రియాక్టర్లను మూసివేసేందుకు ఉత్తరకొరియా అంగీకరించింది.
|
|