|
|
ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు ధరతో చిక్కులు ఏర్పడుతున్నాయని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇతర దేశాలు అడ్డు తగులుతున్నాయన్న వార్తలు అవాస్తవమని చెప్పారు.వాషింగ్టన్ లోని పీటర్సన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో జరిగిన ఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ ధర విషయంలో అంగీకారం కుదిరితే ఈ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చగలదన్నారు. ఈ విషయంలో తమకు ఇతర దేశాల దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నారు.ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారత్- పాక్- ఇరాన్ లు సూత్ర ప్రాయ అంగీకారానికి వచ్చినప్పటికీ, ధర విషయంలో మాత్రమే ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నామన్నారు. ఇరాన్ వద్ద ఉన్న గ్యాస్ ను తమ అవసరాలకు కోరడంలో తప్పేమీ లేదన్నారు.
|
|