|
|  |
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగారకునిపైకి 2037 వ సంవత్సరం నాటికి మానవయాత్ర నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాసా దీర్ఘకాలిక ప్రణాళికల్లో అంగారకునిపైకి మానవయాత్ర ప్రాజెక్టు కూడా ఉందని నాసా అడ్మినిస్ట్రేటర్ మైఖెల్ గ్రిఫిన్ తెలిపారు. 58వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ (ఐఏసీ)లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఐఏసీ 100 వ వార్షికోత్సవాన్ని అంగారకునిపై నిర్వహించేందుకు నాసా ప్రయత్నిస్తామన్నారు. చంద్రునిపైకి మానవ యాత్రను 2020 నాటికి నిర్వహించాలని, మరో దశాబ్దం తరువాత అంగారకునిపైకి మానవయాత్రను నిర్వహించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు.
|
|