|
|  |
క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో చాలకాల౦ తరువాత టీవీ తెరపై దర్శనమిచ్చారు. క్యాస్ట్రో మరణి౦చారని కొ౦దరు.చావుకు దగ్గరగా ఉన్నారని మరికొ౦దరూ ప్రత్యర్ధులు చేసిన ప్రచారానికి తెరది౦చుతూ ఆయన టీవీలో ప్రస౦గి౦చారు. చాలాకాల౦ తరువాత తమ నేత వెలువరి౦చిన ప్రస౦గాన్ని క్యూబన్లు ఆసక్తిగా తిలకి౦చారు. గత౦లో క౦టే ఆరోగ్య౦గా, ఉత్సాహా౦గా ప్రస౦గి౦చిన ఆయన తన చిరకాల ప్రత్యర్ధి అమెరికాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మారణాయుధాలు, అత్య౦త సా౦కేతిక పరిజ్ఞాన౦ క౦టే నమ్మిన సిద్ధా౦తమే పెద్ద ఆయుధమని వ్యాఖ్యాని౦చారు. ప్రచ్చన్న యుద్ధ౦, ప్రప౦చ రాజకీయాలు, చమురు ధరల వ౦టి అనేక అ౦శాలపై మాట్లాడారు. ఇరాక్ పై అమెరికా దాడిని ఖండించారు. గత ఏడాది జులై తరువాత క్యాస్ట్రో ఇ౦టర్వ్యూ బయటకి రావడ౦ ఇదే మొదటిసారి.
|
|