భారత్-శ్రీలంకల నడుమ రైలు వారధి

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' భారత్ -శ్రీలంక లను రైలు మార్గం ద్వారా కలిపేందుకు చేపట్టాల్సిన చర్యలను గురించి వచ్చే ఏడాది జరిగే సార్క్ దేశాల రవాణా మంత్రుల సమావేశంలో చర్చిస్తామని శ్రీలంక తెలిపింది. ఈ విషయాన్ని శ్రీలంక రవాణా శాఖ మంత్రి డుల్లాస్ అలపేరుమా చెప్పారు. ఇందులో భాగంగా తలైమన్నార్, రామేశ్వరం మీదగా చెన్నె-కొలంబో మధ్య రైలు మార్గ నిర్మాణం గురించి చర్చిస్తామని అన్నారు. అలాగే తూత్తుకుడి-కొలంబోల మధ్య ఫెర్రీ సేవలు కూడా ప్రారంభిస్తామన్నారు. 25 ఏళ్ల క్రితం కొచ్చిన్-తలైమన్నార్ మధ్య పెర్రీ సేవలు ఉండేవని ఆయన గుర్తుచేశారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.