9/11 ధాడులకు లాడెన్ కు సంబందం లేదు-మైఖెల్ మెక్

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

ప్రపంచ వాణిజ్య కేంద్రంపై సెప్టెంబర్ 11నాటి దాడికి అసలు సూత్రధారి అల్ జవహరి అని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి అసలు సూత్రధారి బిన్ లాడెన్ అని భావించడం సరికాదని అమెరికా నేషనల్ ఇంటలిజెన్స్ డైరక్టర్ మైఖేల్ మెక్ కానెల్ తెలిపారు. ఏబీసీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈజిప్టుకు చెందిన అల్ ఖైదా ద్వితీయ అగ్రనేత అల్ జవహరి ఆ సంస్థ కార్యకలాపాలకు వ్యూహరచన చేస్తున్నారన్నారు. అల్ ఖైదా నాయకత్వం ప్రస్తుతం ఈజిప్టులోనే మకాం వేసిందని తెలిపిన ఆయన సౌదీలో వారు ఉన్నారనుకోవడం కేవలం భ్రమ మాత్రమేనన్నారు. అలాగే వ్యూహరచన పూర్తిగా అల్ జవహరి సారధ్యం లోనే సాగుతోందని చెప్పారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.