|
కొత్త టేపు ను విడుదల చేసిన లాడెన్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
అల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్ సెప్టెంబర్ దాడుల ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరో వీడియో టేపును విడుదల చేసారు. అమెరికాపై దాడి చేసిన హైజాకర్ ను ఆయన అందులో అభినందించింట్లు సి.ఎన్.ఎన్ నివేదిక మగళవారం తెలిపింది. 47 నిమిషాలున్న ఆ టేపును 9/11 దాడుల విజయోత్సవాన్ని జరుపుకునేందుకు విడుదల చేసినట్లు కనిపిస్తోంది.గత వారం లో విడుదలైన వీడియోలో ఉన్న మాదిరిగానే ఉన్న లాడెన్ చిత్రాన్ని ఈ వీడియో లో చూపారని ఆమె తెలిపారు.ఈ టేపు లో మొదటి 14 నుంచి 15 నిమిషాలలో బిన్ లాడెన్ మాటలున్నాయని ,మిగతా భాగం లో ఆ దాడుల్లో పాల్గొన్న ఒక హైజాకర్ వలీద్ అల్ షిహ్రీని గుర్తు చేసు కొనే అంశాలు ఉన్నాయని ఆమె చెప్పారు.ఇందులో బిన్ లాడెన్ కదులుతున్న చిత్రాలేమీ లేవని లారా తెలిపారు. | |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.