అల్జీరియాలో పేలుడు: 16 మంది మృతి,72 మందికి గాయాలు

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' అల్జీరియాలో జరిగిన బాంబు పేలుడు సంఘటనలో 16 మంది మృత్యువాత పడగా, 72మందికి గాయాలయ్యాయని ఆదేశ అధికార వర్గాలు వెల్లడించాయి.తూర్పు అల్జీరియా పర్యటలో భాగంగా అధ్యక్షుడు ఆబ్డెలాజిజ్ బౌటిఫ్లికాస్ బాట్నా పట్టణంలో గురువారం జరుప తలపెట్టిన పర్యటనకు 45 నిమిషాల ముందుగా ఈ ప్రమాదం సంభవించిందని ఆ వర్గాలు తెలిపాయి.తూర్పు అల్జీరియాలో దేశాధ్యక్షుని పర్యటన సందర్భంగా ఆయన రాకకై ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించిందని పేర్కొన్నాయి.సుమారు ముప్పైయేళ్ల వయసు గల వ్యక్తి బట్నాలోని ఆల్-అతిక్ వీధిలో అధ్యక్షుని రాకకై ఎదురు చూస్తున్న ప్రజల గుంపులోకి పేలుడు పదార్థాలు గల సంచితో దూరిన సమయంలో ఈ పేలుడు సంభవించిందని స్థానిక పోలీసులు చెప్పారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.