|
జోడుపదవుల సవారీని మాను! సుప్రీం కోర్టు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' ముషారఫ్ జోడు పదవులపై దాఖలైన పిటీషన్‌పై ముగ్గురు సభ్యులతో కూడిన పాక్ సుప్రీం ధర్మాసనం విచారించింది.జోడుపదవుల సవారీని మాని ఏదో ఒక పదవిని త్యజించమని పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) బుధవారం ఆదేశించింది. ఇది ముషారఫ్‌కు సుప్రీం కోర్టులో ఎదురైన రెండో ఎదురుదెబ్బ కావడం గమనార్హం. అంతేకాకుండా తన పదవీ కాలంపై పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.ఈ పిటీషన్‌ను దాఖలు చేసేందుకు గత నెల 29వ తేదీన సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. దేశ సైనికాధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్ 1999లో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న విషయం విదితమే. అయితే ఈ పదవీ కాలం ముగిసినప్పటికీ తన పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడగించుకున్నారు. గతంలో పాక్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరిని బర్తరఫ్ చేసిన విషయంలో ముషారఫ్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.